ఎఫ్ 3: ఆహా నా పెళ్ళంట సినిమాను గుర్తుకు తెచ్చే సునీల్ పాత్ర.. ఈ సారైనా నిలబడతాడా?

-

కమెడియన్ సునీల్ హీరోగా మారిన తర్వాత ప్రేక్షకులకు బాగా దూరం అయ్యాడు. సినిమాలకు మంచి టాక్ వచ్చినప్పటికీ ఇంతకుముందులా సొంతం చేసుకోలేకపోయారు. దాంతో వరుసగా ఫ్లాపులు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత చాలా రోజులు సినిమాల్లో కనిపించలేదు. గత కొన్ని రోజుల నుండి మళ్ళీ కమెడియన్ పాత్రలు చేస్తున్న సునీల్, నిలదొక్కుకోలేకపోతున్నాడు. తాజాగా ఎఫ్ 3 సినిమాలో ఓ విలక్షణమైన పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది.

వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో మూడవ హీరోగా సునీల్ కనిపించనున్నాడు. ఇందులో సునీల్ పాత్ర పిసినారిగా ఉంటుందని సమాచారం. పిసినారి పాత్రలో అహ నా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావుని గుర్తుకు తెస్తారని చెప్పుకుంటున్నారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన అహ నా పెళ్ళంట సినిమాలో కోటగారి నటన ఏ లెవెల్లో ఉంటుందో అందరికీ తెలుసు. మరి అదే రకం పాత్రలో సునీల్ ఎంతలా మెప్పిస్తాడో చూడాలి. అలాగే ఈ పాత్రతో అయినా వరుస అవకాశాలు తెచ్చుకుని కమెడియన్ గా బిజీగా మారతాడా అన్నది సినిమా రిలీజైతేనే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news