ప్రకృతి విపత్తుల నుంచి మా గ్రామాన్ని కాపాడండి సార్ అంటూ.. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు జులై 25న లేఖ రాశాడు. ఒక వైపు సముద్రపు కోత, మరోవైపు కరోనా విజృంభణ ఈ రెండింటితో తమ గ్రామం విలవిలలాడిపోతోందని లేఖలో బాలుడు పేర్కొన్నాడు. గత వారం రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సముద్రపు గోడ నిర్మించి.. మమ్మల్ని రక్షించండి అంటూ రాష్ట్రపతిని ప్రాధేయపడ్డాడు. తమ గ్రామంతో పాటు తన కుటుంబానికి సహాయం చేయాలని రాష్ట్రపతిని కోరాడు. ప్రతి ఏడాది ప్రకృతి విపత్తులకు బలవుతూనే ఉంది.
Facing nature's fury, Kerala student writes to President Kovind for help
Read @ANI Story | https://t.co/TKfnDDeljk pic.twitter.com/iGBXnenOfr
— ANI Digital (@ani_digital) July 26, 2020
మాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. ఆ భయంతోనే లేఖ రాస్తున్నాను. నాకు బాగా గుర్తు.. ప్రతి సంవత్సరం రెండు సార్లు మా గ్రామాన్ని విడిచి వెళ్లిపోతాం. ఎండకాలం, రుతుపవనాల సమయంలో మా గ్రామం సముద్రపు కోతకు గురవుతుంది. ఇండ్లలోకి నీరు వస్తుంది. ఈ సంవత్సరం జులై 16 నుంచి సముద్రపు కోత ప్రారంభమైంది. ప్రతి ఏడాది మాదిరిగానే మా బంధువుల ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాం. కానీ మా ప్రాంతంలో కరోనా వ్యాప్తి కారణంగా వెళ్లలేకపోతున్నాం. ఇప్పటికే వందలాది మందికి కరోనా సోకింది అని లేఖలో పేర్కొన్నాడు.