ఫ్యాక్ట్ చెక్: రామ్ రాజ్ కాటన్ క్విజ్ కాంటెస్ట్ ని నిర్వహిస్తోందా..? నిజం ఎంత..?

-

తరచూ మనకి సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త కనపడుతూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అని సోషల్ మీడియా లో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను చూస్తూ ఉంటాం.

అలానే మొన్నటికి మొన్న అమెజాన్ కి సంబంధించి ఫేక్ లింక్ ఒకటి వాట్సాప్ లో తెగ షికార్లు కొట్టింది. మదర్స్ డే గిఫ్ట్స్ అంటూ నకిలీ లింక్ ఒకటి వాట్సాప్ లో వైరల్ అయ్యిపోయింది. ఇలా తరచూ మనం ఎన్నో వాటిని చూస్తున్నాం. ఇక ఇదిలా ఉంటే తాజాగా రామ్ రాజ్ కాటన్ కి సంబంధించి ఒక లింక్ సోషల్ మీడియా లో తెగ షికార్లు కొడుతోంది. వాట్సాప్ లో కూడా రామ్ రాజ్ కాటన్ స్పెషల్ ఆఫర్ అంటూ కంటెస్ట్ జరుగుతున్నట్లు లింక్ విపరీతంగా వైరల్ అవుతోంది.

అయితే నిజంగా రామ్ రాజ్ కాటన్ క్విజ్ కాంటెస్ట్ నిర్వహిస్తోందా..? ఇందులో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. ఈ క్విజ్ కి సంబంధించి నాలుగు సులువైన ప్రశ్నలని అడుగుతున్నారు. అయితే నిజంగా ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పేస్తే ఏమైనా బహుమతులు ఇస్తారా ఇందులో నిజమెంత అనేది పరిశీలిస్తే.. ఈ లింక్ కేవలం నకిలీ వార్త అనే ఇలాంటి కాంటెస్ట్ ని రామ్ రాజ్ కాటన్ నిర్వహించడం లేదని తెలుస్తోంది.

అనవసరంగా ఇటువంటి వాటిని నమ్మి మోసపోకండి. ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పేస్తే ఎలాంటి బహుమతులు రావని తెలుసుకోండి. దీనిపై రామ్ రాజ్ కాటన్ కూడా స్పందించింది. రామ్ రాజ్ కాటన్ ఎలాంటి క్విజ్ ని నిర్వహించడం లేదని ఫేస్బుక్ ద్వారా చెప్పేసింది. ఇది వట్టి ఫేక్ వార్త అని నమ్మద్దు అని చెప్పింది. వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో స్పెషల్ ఆఫర్ పేరిట వస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యకండి. నకిలీ వార్త అని రామ్ రాజ్ కాటన్ చెప్పింది కాబట్టి వీటిని నమ్మి అనవసరంగా మోసపోవద్దు దీంతో మీరు అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news