సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ఫేక్ వార్తల వల్ల కొన్ని సార్లు ప్రధాన మీడియా సంస్థలే తప్పులో కాలేస్తున్నాయి. దీంతో ఆ వార్తలు ఆయా సంస్థలకు చెందిన వెబ్‌సైట్లలో, టీవీ చానళ్లలో ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలో వాటిని పాఠకులు నిజమే అని నమ్ముతున్నారు. సరిగ్గా అలాంటి వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే…
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకే కాదు.. అటు కేంద్రానికి కూడా గణనీయంగా ఆదాయం తగ్గింది. దీంతో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, ఇతర ఖర్చుల కోసం కొంత ఇబ్బంది కలుగుతోంది. అయితే ఆ భారాన్ని కొంత వరకు తగ్గించుకునేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు విభాగాలకు చెందిన ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టాయి. అది తాత్కాలికమే. అయితే కేంద్రం మాత్రం ఇంకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించలేదు. కానీ కేంద్రం ఉద్యోగుల జీతాల్లో 30 శాతం కోత విధిస్తుంటూ వార్తలు వస్తున్నాయి.
Claim: Times Now has reported that Central Govt is mulling over Central govt employees salary pay cut of 30%
#PIBFactCheck: Incorrect. There is no proposal under consideration of Government for any cut in their salaries. Already denied by the Minister : https://t.co/kJZSGezGgF pic.twitter.com/cWdE36w9DH— PIB Fact Check (@PIBFactCheck) May 11, 2020
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 30 శాతం వరకు కోత విధిస్తున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం కావడం.. పలు మీడియా సంస్థలు కూడా ఆ విషయాన్ని వెబ్‌సైట్లలో రాయడంతో.. స్పందించిన కేంద్రం వివరణ ఇచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదని, అవన్నీ అబద్దాలేనని తేల్చి చెప్పింది. ఇప్పటికైతే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించే ఆలోచన తమకు లేదని.. ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగి ఒకరు వివరణ ఇచ్చారు.