జూన్ 15 నుంచి మ‌ళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌.. నిజ‌మేనా..?

-

దేశంలో ప్ర‌స్తుతం కరోనా కేసులు రోజు రోజుకీ భారీ సంఖ్య‌లో పెరిగిపోతున్న విష‌యం విదిత‌మే. నిత్యం 9వేల‌కు పైగా కొత్త క‌రోనా కేసులు న‌మోదవుతున్నాయి. అయితే లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించ‌డం వ‌ల్లే ఇన్ని కేసులు వ‌స్తున్నాయ‌ని, క‌నుక జూన్ 15 నుంచి మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలోనూ ఈ వార్త‌ను చాలా మంది ప్ర‌చారం చేస్తున్నారు. అయితే ఇందులో నిజం ఉందా ? నిజంగానే జూన్ 15 నుంచి మ‌ళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తారా ? అంటే.. ఈ వార్త అబద్ద‌మ‌ని.. ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్ల‌డైంది.

కేంద్రం జూన్ 15 నుంచి మ‌ళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తుంద‌ని వ‌స్తున్న వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని.. పీఐబీ.. ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్ల‌డించింది. ఈ మేర‌కు పీఐబీ ట్వీట్ చేసింది. ఇలాంటి వార్త‌ల‌ను ఏమాత్రం నమ్మ‌రాద‌ని, కేంద్రం ఇంకా ఈ విష‌యంపై ఆలోచించ‌లేద‌ని, క‌నుక ఈ విష‌యంపై వ‌చ్చే వార్త‌ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ న‌మ్మ‌కూడద‌ని తెలిపింది.

కాగా దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 9985 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,76,583 కు చేరుకుంది. 24 గంటల్లో 279 మంది చ‌నిపోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 7745కి చేరుకుంది. ప్ర‌స్తుతం రిక‌వ‌రీ అవుతున్న వారి సంఖ్య 1,35,205 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version