ఫ్యాక్ట్ చెక్: ఈ లాటరీకి ప్రభుత్వానికి సంబంధం ఉందా..?

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ఫేక్ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. తాజాగా ఈ తరహాలోనే ఒక ఫేక్ వార్త వచ్చింది. దీంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని.. ఇలాంటి వాటి జోలికి వెళ్లవద్దని కూడా చెప్పింది. అయితే ఇక ఆ నకిలీ వార్త ఏమిటి అనేది చూస్తే…

ప్రభుత్వం ఒక లాటరీ స్కీమ్ ని తీసుకు వచ్చినట్లు దీని ద్వారా గెలిచిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు అందులో ఉంది. అయితే ఇది నకిలీ వార్త అని పీఐబీ ఫాక్ట్ చెక్ చెప్పింది. ఫోన్ కాల్స్, మెయిల్ మరియు టెక్స్ట్ మెసేజ్ ద్వారా లాటరీని గెలుచుకున్నారు అని 25 లక్షల రూపాయలని పొందొచ్చని వస్తోంది ఇలాంటి లాటరీ స్కీమ్స్ తో జాగ్రత్త గా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.

మీకు తెలియని వాళ్ళతో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవద్దు. ముఖ్యంగా ఫోన్ చేసినా మెయిల్ లేదా టెక్స్ట్ మెసేజ్లు పంపించినా ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోవద్దు. అయితే ప్రభుత్వంతో కలసి కౌన్ బనేగా కరోడ్పతి మరియు రిలయన్స్ జియో ఈ స్కీమ్ తీసుకువచ్చారని నకిలీ వార్త వచ్చింది.

ఇలాంటి ఫ్రాడ్ మెసేజ్లతో జాగ్రత్తగా ఉండండి. ఫ్రాడ్స్ చేయడానికి చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా మార్గాన్ని చూసుకుంటూ జనాల్ని మోసం చేయాలని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిని అనవసరంగా నమ్మి మోసపోకండి.

Read more RELATED
Recommended to you

Latest news