వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపాల్ మాజీ ప్రధాని… భారత్ లో ఆ భూభాగాలు స్వాధీనం చేసుకుంటామంటూ…

-

నేపాల్  దేశ మాజీ ప్రధాని, కమ్యునిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) ఛైర్మన్​ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగాలను స్వాధీనం చేసుకుంటామంటూ వ్యాఖ్యలు చేయడం మరోసారి ఆయన వైఖరిని బయటపెట్టింది. గతంలో కూడా చైనా ప్రోద్భలంతో భారత్ లోని భూభాగాలైన లిపులేఖ్, నింపియాధుర, కాలాపానీ ప్రాంతాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ భూభాగాలు నేపాల్ లో అంతర్భాగం అంటూ నానా రభస చేశారు కేపీ శర్మ ఓలి. గతంలో రాముడి జన్మస్థలం అయోధ్య కాదంటూ.. నేపాల్ లోనే రాముడు జన్మించాడని వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మరోసారి ఈ భూభాగాలపై వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీలను స్వాధీనం చేసుకుంటామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా భారత్​ నుంచి వెనక్కి తీసుకుంటాం. సమస్యలను చర్చలతోనే పరిష్కరిస్తాం తప్ప సరిహద్దు దేశాలతో శత్రుత్వాన్ని పెంచుకోం. వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో అతిపెద్ద రాజకీయ శక్తిగా సీపీఎన్​-(యూఎంఎల్​)పార్టీ ఆవిర్భవిస్తుందని ఓలీ అన్నారు. కమ్యూనిష్టు పార్టీ ఆఫ్​ నేపాల్​ 10వ సాధారణ సమావేశంలో ఓలి ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news