ఫ్యాక్ట్ చెక్: ఆడపిల్లల తల్లిదండ్రులకి రూ.1.80 లక్షలా..? నిజమేనా…?

-

నకిలీ వార్తల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు సోషల్ మీడియాలో తరుచు మనకి నకిలీ వార్తలు కనపడతాయి అలాంటి వార్తలు కనుక కనపడ్డాయంటే వాటితో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ నమ్మి మోసపోకూడదు. సోషల్ మీడియాలో ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది మరి అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్కీములను తీసుకు వచ్చింది ఈ స్కీములు వల్ల చాలా మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇక సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్న వార్త విషయానికి వస్తే… కేంద్ర ప్రభుత్వం 1,80,000 ని అందిస్తుందని ఆడపిల్ల తల్లిదండ్రులకి ఈ పథకం కింద డబ్బులు వస్తాయని. ఈ పథకం పేరు ప్రధానమంత్రి కన్య ఆశీర్వాద యోజన అని అందులో ఉంది.

మరి ఇది నిజమా కాదా అనేది చూస్తే… ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది ఇది ఒక యూట్యూబ్ ఛానల్ లో వచ్చింది ఇలాంటి నకిలీ వార్తలని చూసి అనవసరంగా మోసపోవద్దు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పై స్పందించింది. అనవసరంగా ఇలాంటి నకిలీ వార్తలని చూసి మోసపోకండి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కన్య ఆశీర్వాద్ యోజన అనే స్కీమ్ ని తీసుకురాలేదు ఇది వట్టి నకిలీ వార్త మాత్రమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version