ఫ్యాక్ట్ చెక్: రూ. 2,000 కడితే చాలు.. లక్ష రూపాయిలు లోన్..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. నిజానికి ఇలాంటి నకిలీ వార్తల వల్ల చాలా మంది మోసపోతున్నారు. ఏది నిజం ఏది నకిలీది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కేంద్ర ప్రభుత్వ మన కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్స్ వల్ల మనం ఎన్నో లాభాలని పొందొచ్చు.

సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ కి సంబంధించి ఒక వార్త వచ్చింది మరి అది నిజమా కాదా అందులో నిజం ఎంత అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. పీఎం ముద్ర యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలకి మేలు చేస్తోంది. అయితే పీఎం ముద్ర యోజన కింద లక్ష రూపాయలు లోన్ కావాలంటే లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఫీజ్ కింద 2000 రూపాయలు చెల్లించాలని ఈ వార్తలో ఉంది.

మరి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త నిజమేనా..? నిజంగా మనం రెండు వేల రూపాయల ని లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఫీజు కింద కడితే లక్ష రూపాయల లోన్ మనకి వస్తుందా…? ఈ లెటర్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఇండియా జారీ చేసిందా..? నిజం ఏమిటి అనేది చూస్తే.. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. ఇందులో ఏ మాత్రం నిజం లేదు.

రూ.2000 రూపాయలు కడితే లక్ష రూపాయల లోన్ వస్తుందనేది నకిలీ వార్త మాత్రమే. ఎవరికి కూడా డబ్బులని మీరు కట్టొద్దు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి లెటర్ ని జారీ చేయలేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందించి ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది. ఇటువంటి నకిలీ వార్తలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే నష్టపోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version