ఫ్యాక్ట్ చెక్: ముద్ర యోజన స్కీమ్ కింద రూ. 1,00,000 లోన్..?

-

సోషల్ మీడియాలో కనపడే ప్రతి వార్త కూడా నిజం కాదు, చాలామంది సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజం అని నమ్ముతారు. అయితే నిజానికి సోషల్ మీడియాలో నకిలీ వార్తలు కూడా వస్తూ ఉంటాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది తప్పకుండా తెలుసుకోవాలి. నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉంటే మోసపోకుండా ఉంటారు లేకపోతే అనవసరంగా చిక్కుల్లో పడతారు.

సోషల్ మీడియాలో తాజాగా ఒక వార్త వచ్చింది. మరి అది నిజమా కాదా..? అందులో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకుందాం. ముద్ర యోజన స్కీమ్ కింద లక్ష రూపాయలు పొందచ్చని ఒక వార్త సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది.

ముద్ర యోజన స్కీమ్ కోసం లక్ష రూపాయలని పొందాలంటే రూ. 1750 ని కట్టాలని ఆ వార్తలో ఉంది. ఇది నిజమా కాదా అనేది చూస్తే.. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది ఇందులో నిజం లేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది కనుక అనవసరంగా ఇటువంటి వార్తలను నమ్మి మోసపోకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version