ఓ మహిళపై 19 ఏళ్లుగా అత్యాచారం.. బయటపడ్డ దొంగ బాబా గుట్టు..

-

అత్యాధునిక టెక్నాలజీ పెరిగిపోతున్న నేటి సమాజంలో.. ఇంకా మూఢనమ్మకాలు నమ్మేవారున్నారు. అలాంటి వారిని ఆసరాగా చేసుకొని దొంగబాబాలు సొమ్ముచేసుకుంటున్నారు. అయితే ఓ దొంగ బాబా ఓ మహిళపై 19 ఏళ్లుగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆఖరికి సదరు మహిళ కూతుళ్లపై కూడా ఈ దొంగ బాబా కన్ను పడింది. దీంతో తాళలేక సదరు మహిళ పోలీసులను ఆశ్రయిండంతో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. బాధితురాలు ఖరన్​పుర్​లో నివాసం ఉండేది. కాగా, ఆమె 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అనారోగ్యానికి గురికావడంతో అదే ప్రాంతంలో ఉండే పరమానంద పురి అలియాస్ ప్రవీణ్ గుజ్రాల్ అనే బాబా వద్దకు వెళ్లింది.

ఈ క్రమంలో ఆమెను ఆత్మల పేరుతో భయపెట్టి ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించాడు సదరు దొంగబాబా. అనంతరం కూల్​డ్రింక్​లో మత్తు మందులు కలిపి ఆమెను వివస్త్రను చేసి అత్యాచారం చేశాడు. అయితే, 2006లో సదరు దొంగ బాబా ఆ ప్రాంతం వదిలి డెహ్రాడూన్‌కు వెళ్లిపోయాడు. అనంతరం 2012లో ఆమెకు ఓ మానసిక రోగితో వివాహం జరిపించి.. సదరు మహిళపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. తాజాగా ఆమె కుతూళ్లపై దొంగ బాబా కన్నేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. దీవెనెల పేరుతో ప్రవీణ్‌ గుజ్రాల్‌ తనను అనుచితంగా తాకేవాడని తెలిపింది. బాబా ఇచ్చే ఔషధాల వల్ల తనకు చాలా సార్లు అబార్షన్ అయిందని వాపోయింది. 2021 మే నెలలో తన కూతుళ్లతో బాబా కన్నేసి లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. తన వద్ద నుంచి బాబా రూ.40 లక్షలు తీసుకున్నాడని చెప్పుకొచ్చింది. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version