సెక్స్‌కు ఒప్పుకోలేదని.. ట్రైన్‌ నుంచి తోసేసిన వైనం..

-

రోజురోజకు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆడది ఒంటిరిగా కనిపిస్తే చాలు.. వారిపై పడి లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఎంతపైననా చేస్తున్నారు. అయితే.. మధ్యప్రదేశ్ లో వేధింపులను ప్రతిఘటించిందని ఓ యువకుడు యువతిని కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని బండా జిల్లాకు చెందిన ఓ యువతి.. ఏప్రిల్ 27న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్పూర్ జిల్లాలో ఉన్న బాగేశ్వర్ ధామ్ ఆలయానికి వచ్చింది. దైవ దర్శనం అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు రాత్రి రైల్లో బయల్దేరింది. ఒంటరిగా ఉన్న ఆమెను అదే బోగీలో ఉన్న ఓ వ్యక్తి వేధించడం ప్రారంభించాడు. యువతి అతనిని ప్రతిఘటించింది. తన వద్దకు రావద్దని, దూరంగా ఉండాలని యువతి సూచించింది.

అతడ్ని నిలువరించేందుకు ఆ వ్యక్తి చేతిని కొరికింది. ఈ ఘటనతో సదరు ప్రయాణికుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. రైలు ఖజురహో, మహోబా స్టేషన్ల మధ్య ఉన్న సమయంలో యువతిని కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. వేగంగా ప్రయాణిస్తున్న రైలు నుంచి తోసేయడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. రైలు పట్టాల పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న యువతిని గమనించిన స్థానికులు.. రైల్వే అధికారులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం బాధితురాలిని ఛతర్పూర్లోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version