ఉత్తరప్రదేశ్‌లోని దియోబంద్‌కు చెందిన ఓం పాల్ (50) తనకు తెలిసిన డాక్టర్ రాజేష్ అనే వ్యక్తికి చెందిన ఎంబీబీఎస్ డిగ్రీలను క్లోన్ చేసి తానే రాజేష్ అని చెప్పి గత 10 సంవత్సరాలకు పైగా అక్కడ డాక్టర్‌గా చెలామణీ అవుతున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం అందరూ చూశారు కదా.. అందులో శంకర్‌గా నటించిన చిరంజీవి ఎలాగైనా సరే డాక్టర్ కావాలని అడ్డదారులు తొక్కుతాడు. అయితే అది సినిమా మాత్రమే. కానీ రియల్ లైఫ్‌లోనూ అలాంటి ఓ శంకర్ దాదాను యూపీ పోలీసులు పట్టుకున్నారు. ఎంబీబీఎస్ చదవకపోయినా.. చదివినట్లు.. మరొకరి పేరిట ఉన్న డిగ్రీని తనదిగా పేర్కొంటూ.. గత 10 సంవత్సరాలకు పైగానే అతను డాక్టర్‌గా చెలామణీ అవుతున్నాడు. కానీ మోసం ఎన్నటికీ దాగదు కదా.. అందుకనే అతను ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని దియోబంద్‌కు చెందిన ఓం పాల్ (50) తనకు తెలిసిన డాక్టర్ రాజేష్ అనే వ్యక్తికి చెందిన ఎంబీబీఎస్ డిగ్రీలను క్లోన్ చేసి తానే రాజేష్ అని చెప్పి గత 10 సంవత్సరాలకు పైగా అక్కడ డాక్టర్‌గా చెలామణీ అవుతున్నాడు. అంతేకాదు.. అతను సహరాన్‌పూర్ జిల్లాలో ఏకంగా ఓ నర్సింగ్ హోంను నిర్వహిస్తూ ఇప్పటికే అనేక సర్జరీలు కూడా చేశాడు. అలాగే మంగళూరులోని ఎయిర్‌ఫోర్స్ హాస్పిటల్‌లో కొంతకాలం పారామెడిక్‌గా పనిచేసి, ఆ తరువాత అందులో మానేసి అక్కడి నుంచి ఇప్పటికీ పెన్షన్ తీసుకుంటున్నాడు. అదేవిధంగా అమెరికాలోని పలు యూనివర్సిటీల నుంచి సర్జన్ సర్టిఫికెట్లను కూడా అతను సంపాదించాడు.
ఓం పాల్ అలా డాక్టర్‌గా చెలామణీ అవుతూ ఎంతో మందిని మోసం చేయడంతో.. అతని గురించిన తెలిసిన ఓ వ్యక్తి అతన్ని రూ.40 లక్షలు ఇవ్వాలని, లేకపోతే అతని బండారం బయట పెడతానని కాల్ చేశాడు. దీంతో ఓం పాల్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే అనుకోకుండా అతని వ్యవహారం మొత్తం పోలీసులకు తెలిసిపోయింది. దీంతో వారు ఓం పాల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలా.. ఆ నకిలీ డాక్టర్ బండారం బట్ట బయలైంది. నిజంగా ఇది అందరినీ షాక్‌కు గురి చేసే విషయం. ఇంకా ఇలాంటి నకిలీ డాక్టర్లు దేశంలో ఎంత మంది ఉన్నారో.. వారి చేతుల్లో ఎంత మంది అభాగ్యులు బలయ్యారో.. ఊహించుకుంటేనే దిమ్మ తిరిగిపోతుంది.. అయినా ఏం చేస్తాం.. అంతా మన ఖర్మ కాకపోతే..!