హైదరాబాద్ లో నకిలీ డాక్టర్..ఇంటర్ చదివి బిల్డప్..చివరికి!

-

ఉస్మానియా ఆసుపత్రి లో నకిలీ డాక్టర్ గా చలామణి అవుతున్న నిందితుని అఫ్జల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీ బండ్లగూడ కు చెందిన ‘మర్వాన్ బిన్ అబ్దుల్ అజిజ్ అలీ ‘ చదివింది ఇంటర్ బైపీసీ. గత కోనేళ్లుగా ఎంసెట్, నీట్ పరీక్షలు రాస్తూ అర్హత సాధించలేదు. తోటి స్నేహితులు బాగా చదువుకొని ఉన్నత హోదాలో ఉద్యోగం చేస్తుండడంతో అజిజ్ అలీ తన మామ ట్రావెల్ ఏజెన్సీ లో పని చేస్తున్నాడు. అయితే చేసే పనిలో తన అవసరాలకు డబ్బులు సరిపోకపోవడం తో స్థానికంగా ఉన్న ప్రైవేట్ క్లినిక్ లోకి వెళ్లి ఒక వైద్యుడిని కలిసాడు. తాను బైపీసీ చదివానని, రోగి కి అందించాల్సిన వైద్య చికిత్స లు అన్ని తెలుసు అని ఓ వైద్యునికి చెప్పడంతో అతను నిరకరించాడు.

వైద్య వృత్తి చేయాలంటే ఏంబీబీఎస్ సర్టిఫికెట్ తప్పనిసరి అని చెప్పడం తో అలీ ఉస్మానియా ఆసుపత్రి కి డాక్టర్ కోట్ వేసుకొని మేడలో స్టేతస్కోప్ వేసుకొని దర్జాగా ఆసుపత్రి లో అత్యవసర విభాగం లో తోటి వైద్యులతో సమానంగా కూర్చున్నాడు. కొద్ది సేపటి తర్వాత క్యాజువాలిటి సీఎంఓ అతని ప్రవర్తన పై ఆరా తీసింది. పొంతన లేని సమాధానాలు చెపుతుందడంతో అతడు నకిలీ వైద్యుడు గా చలామణి అవుతున్నాడని గుర్తించి వెంటనే స్థానిక అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసుల విచారణలో అలీ నకిలీ వైద్యుడు అని తేలడం తో నిందితుని పైన 170, 420, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news