బంజారాహిల్స్ లో న‌కిలీ ఎస్సై అరెస్ట్.. !

ఓ డ్రైవ‌ర్ తాను పనిచేస్తున్న ఇంటికే క‌న్నం వేశాడు. య‌జ‌మానిని బెదిరించి డ‌బ్బులు గుంజాల‌ని ప్ర‌య‌త్నించాడు. దానికి ఓ మాస్ట‌ర్ ప్లాన్ వేశాడు. కానీ చివ‌రికి క‌ట‌క‌టాల పాల‌య్యాడు. వివ‌రాల్లోకి వెళితే..బంజారాహిల్స్ కు చెందిన ఓ డాక్ట‌ర్ వ‌ద్ద మ‌హేష్ అనే వ్య‌క్తం డ్రైవ‌ర్ గా ప‌నిచేస్తున్నాడు. కాగా ఆ డ్రైవ‌ర్ కు ఫోన్ చేసి డ‌బ్బులు గుంజేందుకు మ‌హేష్ ప‌థ‌కం ర‌చించాడు. ఖ‌మ్మం ఎస్సై అని చెప్పి డాక్ట‌ర్ ను బెదిరించి రూ.75 డిమాండ్ చేయాల‌ని ఓ వ్య‌క్తితో ఫోన్ లు చేయించాడు.

fake si in banjarahils
fake si in banjarahils

వేధింపులు ఎక్కువ అవ్వ‌డంతో డాక్ట‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచారణ జ‌రిపి నకిలీ ఎస్సై ని అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం డాక్ట‌ర్ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న డ్రైవ‌ర్ మ‌హేష్ ఈ ప‌నిచేయించిన‌ట్టు గుర్తించారు. మ‌హేష్ ద‌గ్గ‌ర దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్ ఉండ‌టంతో అత‌డిని వైద్యుడు విధుల్లోనుండి తొల‌గించారు. అనంత‌రం పోలీసులు అరెస్ట్ చేశారు.