గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటన పై వీడ‌ని మిస్ట‌రీ.. !

రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన గాంధీ ఆస్ప‌త్రి అత్యాచార ఘ‌ట‌న‌లో ఇంకా మిస్ట‌రీ వీడ‌లేదు. పోలీసుల ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న‌ప్ప‌టికీ కేసు చిక్కుముడి వీడ‌లేదు. ఈ కేసు పోలీసుల దృష్టికి వచ్చి ముడు రోజులు గడుస్తున్నా ఇంకా సస్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. గాంధీ ఆస్పత్రి నుంచి బాధిత మహిళ అక్కను సీసీ ఫుటేజ్ లో చిలకల గూడ పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా లో బాధిత మహిళ అక్క ఎటువైపు వెళ్ళిందో ప‌రిశీలించి ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ ఆచూకీ ల‌భించ‌లేదు.

ghandi hospital rape case

గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే సీసీ ఫుటేజ్ తో పాటు మ‌రి కొన్ని ఆధారాలు కూడా క్లూస్ టీం & పోలీసులు సేక‌రించారు. ఈ కేసు చేదించేదుకు 6 బృందాలుగా ఏర్పడి పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. బాధిత మహిళ అక్క ఆచూకి కోసం తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు లుక్ అవుట్ మిస్సింగ్ కేసు నోటీస్ జారీ చేశారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ప్ర‌స్తుతం నలుగురిని విచారిస్తున్నారు.
అనుమానితులు ఉమా మహేశ్వర్, తో పాటు ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది ని ప్రశ్నించారు.