2003 లో సంచలనం రేపిన “స్టాంప్ పేపర్స్” కుంభకోణం విడుదల !

-

ప్రపంచంలో ఎన్ని కుంభకోణాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని వెంటనే వెలుగులోకి వస్తాయి.. మరికొన్ని ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి. కానీ తప్పు జరిగిన తరువాత ఎప్పుడైనా బయటపడి తీరుతుంది. అదే విధంగా భారతదేశంలో 2003లో జరిగిన ఒక కుంభకోణం అప్పట్లో ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. నకిలీ స్టాంప్ పేపర్ ల అమ్మకం తో అబ్దుల్ కరీం తెల్గీ అన్యాయానికి పాల్పడ్డాడు. ఈ స్కాం ను ప్రేక్షకుల దృష్టికి ఒక వెబ్ సిరీస్ రూపంలో తీసుకురానున్నారు మేకర్స్. బాలీవుడ్ కు చెందిన తుషార్ హీరో నందని మరియు హన్సల్ మెహతా లు డైరెక్షన్ చేయగా, తెల్గీ పాత్రలో గగన్ దేవ్ నటించారు. ఈ సిరీస్ ను ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని కలిగించింది. రేపు సోనీ లివ్ లో విడుదల కానుంది..

ఇంతకు ముందు స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితాన్ని ఆధారంగా తీసుకుని చేసిన వెబ్ సిరీస్ స్కాం 1992 బాగా హిట్ అయింది . మరి ఈ సిరీస్ కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందా లేదా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news