ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో ఎక్కువ ఫేక్ వార్తలు మనం వింటూనే ఉన్నాం. అయితే నిజానికి ఫేక్ వార్తలతో దూరంగా ఉండాలి. లేదంటే అనవసరంగా మనమే ఇబ్బంది పడాలి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. దానికి సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించింది.
అధికారిక కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి.. అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది. అయితే గెలిస్తే తమ పార్టీ నేత భగవంత్ ని సీఎం చేస్తామని ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఎన్నికల ముందే ప్రకటించారు. అయితే పంజాబీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సోషల్ మీడియా లో ఒక వార్త వైరల్ గా మారింది.
पंजाब फतह के बाद , पंजाब के भावी मुख्यमंत्री..!!! pic.twitter.com/lFj3Tlj47m
— Ratnakar (@ratnakar273) March 11, 2022
పైగా వీడియో సెన్సేషన్ గా మారింది. ఎన్నికల లో గెలిచిన తర్వాత మత్తులో కాబోయే సీఎం భగవంత మాన్ అంటూ ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో లో భగవంత్ మాన్ తాగినట్లు కనబడుతున్నారు. ఆయన్ని తోటి నాయకులు కార్లో ఎక్కించుకుని తీసుకు వెళ్లారు.
ఈ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను చూస్తే పాత లింకులు బయట పడ్డాయి. ఇది ఇప్పటిది కాదని.. 2019 లోనిది అని తెలుస్తోంది. నిజానికి ఇటీవల ఎన్నికల తర్వాత దృశ్యం అంటూ ఈ వీడియోని తప్పు దారి పట్టిస్తున్నారు అంతే కాని ఇందులో ఏ మాత్రమూ నిజం లేదు. ఇది కేవలం ఫేక్ వార్త మాత్రమే.