ఈ కరోనా మహమ్మారి భయంతో బ్రతికి ఉండగానే మనిషిని చితికి చేర్చేలా చేసింది. ప్రకాశం జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో హృదయాన్ని కదిలించే ఘటన చోటు చేసుకుంది. బ్రతికి ఉన్న వ్యక్తిని స్మశాన వాటికji తీసుకువెళ్ళిన కుటుంబ సభ్యులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.. అతనికి గుండెలో నిమ్ము ఉండటంతో ఆరోగ్యం మరింత క్షీణించి పక్షవాతం వచ్చింది.. దీంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
అక్కడ డాక్టర్లు రోగిని పరీక్షించి అతను రెండు రోజుల కన్నా ఎక్కువ బ్రతకడని నిర్ధారించారించారు. కాగా రోగిని ఓ ప్రైవేటు ఆసుపత్రి సంబంధించిన ఆంబులెన్స్ లో స్మశాన వాటిక తీసుకొనివచ్చి వదిలేశారు. దీని గురించి వెంకటేశ్వర్లు భార్యను కుమారుడు ను వివరణ కోరగా.. కరోనా భయంతో తాము అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ లోపలికి రానివ్వలేదు అని అందుకే ఏం చేయాలో పాలుపోక ఈ విధంగా చేశామని సమాధానమిచ్చారు. మహమ్మారి కారణంవల్ల రోజు రోజుకి మానవ సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయి.