లైగర్ ఫస్ట్ డే వసూళ్లను కూడా అందుకోలేకపోయిన ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

-

విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్ కాంబినేషన్లో రాబోతున్న మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమా ఏప్రిల్ 5న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఈ మూవీపై నెగటివ్ టాక్ ప్రభావం మామూలుగా లేదు. దీంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా డిజాస్టర్ మూట కట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా తొలి వారం కలెక్షన్స్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన లైగర్ తొలిరోజు కలెక్షన్స్ ని కూడా అందుకో లేకపోయింది.

విడుదలకు ముందు లైగర్ మూవీ పై భారీ అంచనాలు ఉండడంతో తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్లకుపైగా కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇక ఫ్యామిలీ స్టార్ ఏడు రోజులు కలిపి ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.30.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే సాధించింది. గురువారం ఏడో రోజు రంజాన్ పండగ హాలీడే ఉన్నా కూడా ఈ సినిమాకు కేవలం రూ.94 లక్షల వసూలు మాత్రమే రాబట్టగలిగింది.

 

Read more RELATED
Recommended to you

Latest news