2020 సంవత్సరం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఒక బ్లాక్ ఇయర్ గా చెప్పవచ్చు. ఎందుకంటే.. ఎంతో మంది సినీ ప్రముఖులు 2020 సంవత్సరం లో మృతి చెందారు. దీంతో అభిమానులు అందరూ విషాదంలో మునిగిపోయారు. ఇటీవలె మరో ప్రముఖ దర్శకుడు కన్నుమూశారు. అనారోగ్యం బారినపడిన ప్రముఖ కన్నడ దర్శకుడు విజయ్ రెడ్డి ఆయన నివాసంలో కన్నుమూశారు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
వయోభారంతో బాధపడుతున్న 88 ఏళ్ల దర్శకుడు విజయ్ రెడ్డి.. ఇటీవలే చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా ఏపీలోని తాడేపల్లి గూడెంకు చెందిన ఆయన కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. తన సినిమాలతో ప్రజలకు ఎన్నో మెసేజ్ లు కూడా ఇచ్చారు. ఇక ఆయన మృతితో అభిమానులను విషాదంలో మునిగిపోయారు. విజయ్ రెడ్డి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.