టాలీవుడ్‌ లో విషాదం..”అఖండ” సినిమా నటుడు మృతి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.

ప్రముఖ సినీ నటుడు కెప్టెన్‌ చలపతి చౌదరి కన్నుముశాఱు. అనారోగ్యంతో బాధపడుతూ.. రాయచూర్‌ లోని ఓ ఆస్పత్రి లో మరణించారు. చలపతి చౌదరి పలు దక్షినాది సినిమాల్లో నటించి.. మంచి గుర్తింపు తెచ్చకున్నారు. బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ లో కలిపి మొతతం 100 సినిమాల్లో నటించారు. అలాగే పలు సీరియల్స్‌ లో కూడా నటించారు. విజయవాడకు చెందిన చలపతి చౌదరి రాయ్‌ చూర్‌ లో స్థిరపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news