ప్రముఖ టాలీవుడ్ దర్శకుడిపై కరోనా పంజా.!

-

ప్రస్తుతం కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరి పై పంజా విసురుతుంది ఈ మహమ్మారి వైరస్. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇటీవల సీనియర్ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సెప్టెంబర్ 9వ తేదీన కరోనా వైరస్ బారిన పడిన తెలిపిన సంగీతం శ్రీనివాసరావు… ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నానని ఈనెల 22వ తేదీన హోమ్ ఐసోలేషన్ పూర్తవుతుంది అని వెల్లడించారు.

ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఒక ప్రత్యేక గదిలో ఉండడం.. చదువుకునే రోజుల్లో హాస్టల్ గదిలో ఉన్న అనుభవాలను గుర్తు చేస్తోంది అంటూ ఆయన చమత్కరించారు. నేను ఇప్పుడు పాజిటివ్ ఏంటి గత 60,70 ఏళ్ళనుంచి పాసిటివ్ అంటూ చమత్కరిస్తూ అభిమానులందరిలో దైర్యం నింపారు శ్రీనివాసరావు. అభిమానులు మిత్రులు బంధువులు కంగారు పడొద్దని… కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version