ఫ్యాన్ ‘స్వీప్’: సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

-

ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా సరే..ఏపీలో ఇప్పటినుంచే ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చలు నడిచిపోతున్నాయి..నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ జగన్ గెలుస్తారా? లేక ఈ సారి చంద్రబాబు సీఎం పీఠం ఎక్కుతారా? టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? ఇలా ఒకటి ఏంటి అనేక రకాలుగా ఎన్నికల గురించి చర్చలు నడుస్తున్నాయి. ఎన్నికల గురించి రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి..ఇదే క్రమంలో నెక్స్ట్ వైసీపీ క్లీన్ స్వీప్ చేసే జిల్లాలు ఉంటాయా? లేవా? అనేది కూడా చర్చకు వస్తుంది.

గత ఎన్నికల్లో జగన్ గాలి నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది..కడపలో పది సీట్లు ఉంటే పది సీట్లు ఫ్యాన్ ఖాతాలో పడ్డాయి..అలాగే కర్నూలులో 14 సీట్లు, నెల్లూరులో 10 సీట్లు, విజయనగరంలో 9 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఇలా నాలుగు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ సారి ఎన్నికల్లో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్తితులని బాటి చూస్తే పెద్దగా ఉన్నట్లు కనిపించడం లేదు.

సాధారణంగానే అధికార పార్టీపై వ్యతిరేకత ఉంటుంది..ఇప్పుడు వైసీపీపై కూడా కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. ఇంకా ఎన్నికల సమయం దగ్గరపడే కొద్ది ఇంకాస్త వ్యతిరేకత పెరగొచ్చు..కాబట్టి క్లీన్ స్వీప్ అనేది అంత సులువు కాదు…కాకపోతే ఆ నాలుగు జిల్లాల్లో వైసీపీ మెజారిటీ సీట్లు మాత్రం గెలవచ్చని చెప్పొచ్చు. కడప ఎలాగో వైసీపీకి అనుకూలమే…కాకపోతే ఇక్కడ ఒకటి, రెండు సీట్లలో టీడీపీ పికప్ అవుతున్నట్లు కనిపిస్తోంది..కాబట్టి కడపలో ఈ సారి వైసీపీ క్లీన్ స్వీప్ కష్టమే అని చెప్పొచ్చు.

అటు కర్నూలులో కూడా టీడీపీ నాలుగైదు సీట్లలో బలం పెంచుకుంది…కాబట్టి ఇక్కడ క్లీన్ స్వీప్ అంత ఈజీ కాదు…నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో కూడా అదే పరిస్తితి ఉంది…మొత్తానికి చూసుకుంటే ఈ సారి ఫ్యాన్..క్లీన్ స్వీప్ చేయడం కష్టమనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version