బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధం.. ప్రధానికి రేవంత్ రెడ్డి లేఖ

-

హైదరాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధం అని విమర్శించారు. రాజకీయాలే తప్పా ప్రజా సమస్యలు, యువత, నిరుద్యోగం అంశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి సంబంధం ఉందని తెలంగాణ సమాజం నమ్ముతోందని రేవంత్ రెడ్డి లేఖలో విమర్శించారు. విద్యుత్ చట్టాలు, విద్యా సంస్కరణ చట్టాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీగా అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపిస్తోందని… కేంద్రం ఎందుకు సీబీఐ విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. నిజామాబాద్ లో గెలిస్తే పసుపు బోర్డు తెస్తామని చెప్పి మాట తప్పారని.. హమీ నెరవేర్చలేదని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో ఐటీఐఆర్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసే లేదని ఆయన అన్నారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ వెనకాల కేసీఆర్ కుటుంబం అవినీతి ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని… కేసీఆర్ పై ఈగ కూడా వాలనీయరా..? అని ప్రశ్నించారు. రామాలయం సర్క్యూట్ లో భద్రాద్రి రామాలయానికి చోటు ఎందుకు దక్కలేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version