సెలబ్స్ కు మీడియాకు చురకలంటిస్తూ సూచనలు చేసిన రైతు!

-

కడుపుమండిందో లేక రైతు కష్టాన్ని ఇబ్బందినీ సమాజంతో పాటు మీడియా కూడా పట్టించుకుకోవడం మానేసింది… ఒకవేళ పట్టించుకున్నా.. ఆ మీడియాకు నచ్చిన పార్టీ అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా పట్టించుకుంటుందని భావించారో ఏమో కానీ… ఒక రైతు తాజాగా మీడియాకు కొన్ని సూచనలు చేశారు… ఆ సూచనలకు మధ్య మధ్యలో చురకలు కూడా ఉన్నాయనుకోండి! ఇంతకూ ఆ రైతు కోరుకునేది ఏమీకాదు… కేవలం తనతో పాటు మిగిలిన రైతుల సమస్యలపై దృష్టి పెట్టమని. సెలబ్రెటీలు అంట్లు కడుకున్నారు, ఇల్లు తుడుచుకున్నారు వంటి విషయాలపై దృష్టి పెట్టేకంటే… వాటినే పదే పదే చూపించే కంటే… రైతు సమస్యలపై కూడా దృష్టి పెట్టాలనీ సూచిస్తున్నాడు ఆ రైతు!

అవును… లాక్ డౌన్ నేపథ్యంలో సెలబ్రెటీలు ఇంట్లో ఉంటూ అంట్లు తోమారని, వంట చేశారని, ఇల్లు ఊడ్చారని ఇలా యూటూబ్, సోషల్ మీడియాలో పెడుతున్నారని.. కడపజిల్లా, పుల్లంపేట మండలానికి చెందిన ఏ. వెంకటప్రసాద్ అనే రైతు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన యూటూబ్ ద్వారా మీడియాకు ఒక విజ్ఞప్తి కూడా చేశారు. సెలబ్రెటిలు ఇంట్లోపనులు చేసినవి చూపించేకంటే.. రైతులు తోటల్లోనూ, పొలాల్లోనూ పడే కష్టాలను మీడియా వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు సదరు రైతు.

ఈ సమయంలో తన వ్యక్తిగత సమస్యను వివరించిన ఆ రైతు… తాను రూ. 10 లక్షలు ఖర్చుపెట్టి అరటి తోట వేశానని.. చేతికందిన పంటను అమ్ముకోలేక, ఆకాల వర్షాల కారణంగా పంట అంతా నేలపాలైందన్నారు. పంట కాలువలు లేక, కనీసం చెరువులు కూడా నిండక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ఏ మీడియా అయినా సోషల్ మీడియా అయినా… తమ కష్టాలను వెలుగులోకి తేవాలని కోరుతున్నాడు ఆ రైతు. ఆయన చెప్పినదానిలో ఏమైనా తప్పుందా? లేదు అనేది అందరి సమాధానమా?

Read more RELATED
Recommended to you

Exit mobile version