యూరియా కష్టాలు తెలంగాణ రైతులను వేధిస్తున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో రైతులు… వ్యవసాయ కేంద్రాల ముందు అలాగే ఫర్టిలైజర్ షాప్ ల ముందు క్యూ లైన్ కడుతున్నారు. గతంలో తెలంగాణ రాకముందు లాంటి పరిస్థితులను ఇప్పుడు తీసుకువచ్చారు. చెప్పులు కూడా లైన్ లో పెట్టి వెళ్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలోనే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. రైతు మూర్చ వచ్చి కింద పడిపోయాడు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రసాయన ఎరువుల కేంద్రం వద్ద యూరియా కోసం రైతు క్యూ లైన్ లో నిలబడ్డాడు. అయితే నిలబడి విసిగి చెందిన ఆ రైతుకు ఒకసారిగా మూర్చ వచ్చింది. దీంతో ఆ రైతు కింద పడిపోయాడు. ఆ రైతును వెంటనే… మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఆసుపత్రికి తరలించారు. వెంటనే అంబులెన్స్ ను రంగంలోకి దింపి… ఆసుపత్రికి పంపించారు.