ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధనిక ముఖ్యమంత్రిగా రికార్డులోకి ఎక్కారు. దేశంలోనే ఎక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రిగా గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు.

ఓ నివేదిక తెలిపిన లెక్కల ప్రకారం… సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుత ఆస్తులు 931 కోట్లుగా ఉన్నాయి. ఇందులో 10 కోట్లు అప్పులు ఉన్నట్లు స్పష్టం చేసింది ఆ నివేదిక. అలాగే రెండవ స్థానంలో అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా 332 కోట్ల ఆస్తులతో ఉన్నారు. ఇక సీఎం చంద్రబాబు మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడవ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తులు మొత్తం 30 కోట్లుగా ఉన్నాయి. మమత బెనర్జీ చిట్టచివరలో… 15 లక్షలతో నిలిచారు.