అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.20 రోజులుగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వడ్లు మొత్తం తడిచిపోయాయి. వివరాల్లోకివెళితే.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజరా గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ 18 ఎకరాల్లో వరి సాగు చేశారు.
20 రోజుల కింద వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా..అప్పటి నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడమే అకాల వర్షానికి వడ్లు తడిసి ముద్దయ్యాయి. దీంతో దంపతులు గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కన్నీళ్లు పెట్టించింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి.