అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఘోర అపశృతి చోటుచేసుకుంది. ఆంధప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా విడవలూరు మండలం స్థానిక అంకమ్మ గుడి సెంటర్ లో తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిన్న రాత్రి అంబేద్కర్ విగ్రహం ఊరేగింపులో టపాసులు పేలడంతో మంటలు చెలరేగాయి.
పేలుడు ధాటికి బిల్డింగ్ ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు 15 మందికి స్వల్ప గాయాలు అవ్వగా.. ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.