ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మత్స్యకారులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి ఏపీలో చేపల వేటకు విరామం ఇవ్వనున్నారు అధికారులు. ఈ రోజు నుంచి దాదాపు 61 రోజులపాటు చేపల వేట బంద్ కానుంది. ఒకవేళ ఈ రూల్స్ బ్రేక్ చేసి ఎవరైనా… చేపలు పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఈ రూల్స్ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.

చేపల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు… తల్లి రొయ్యలను సంరక్షించడం… వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం… మత్స్య సంపద పెంచేందుకు గాను… 61 రోజులపాటు వేట కు వెళ్లకూడదని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ 61 రోజుల పాటు వేట నిషేధిస్తే మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారు. ఇలాంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వాళ్లకు జీవన భృతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.