గత కొన్ని రోజులుగా దేశ రైతులందరూ వ్యవసాయ చట్టాలపై తమ నిరసన తెలియజేస్తున్నారు. కొత్తగా రూపొందించిన చట్టాలు రైతులకి మేలు చేయడం అటుంచి, హాని కలగజేస్తాయని, దానివల్ల కార్పోరేట్ల చేతుల కింద బానిసలుగా బతకాల్సి వస్తుందని, అలాంటి వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని నిరసన చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఈ నిరసన తీవ్రరూపం దాల్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ విధ్వంసానికి దారి తీసింది.
ఈ నేపథ్యంలో రైతులపై కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. అదలా ఉంచితే, వ్యవసాయ చట్టాలపై రచ్చ చేస్తున్న రైతులని ఉద్దేశించి, ప్రధాన మంత్రి కొన్ని వరాలు ఇచ్చారు. ఫిబ్రవరి 1వ తేదిన బడ్జెట్ ప్రకటించే బడ్జెట్ లో రైతులకే పెద్ద పీట వేస్తామని, రైతులకి అవసరమయ్యే విషయాలకి ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తామని, ఈ బడ్జెట్ లో వ్యవసాయానికే ఎక్కువ ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలిపాడు.