చిత్తూరు జిల్లా మదనపల్లి అక్కాచెల్లెళ్ల హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది పివి కృష్ణమాచార్య స్వచ్ఛందంగా వాదించనున్నట్టు తెలుస్తోంది. సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు, ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా కూడా ఇదివరకు కోర్టులో న్యాయవాది పీవీ కృష్ణమాచార్య వాదిస్తున్నారు. మదనపల్లె కేసులో ఏ-1 గా ఉన్న ప్రొఫెసర్ పురుషోత్తం నాయుడు దగ్గర విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల అభ్యర్ధన మేరకు ఈ కేసులో కృష్ణమాచార్య వాదించడానికి సిద్దం అయినట్టు చెబుతున్నారు.
ఇప్పటికే కేసు గురించి తన జూనియర్ రజనీ ద్వారా కృష్ణమాచార్య వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులిద్దరూ ఉన్నత చదువులు చదివి, సమాజంలో ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారని, వారు కూతుళ్లను అమితంగా ఇష్టపడుతారని వీరు కూతుళ్లను ఎందుకు చంపుతారు…. అన్న అంశంపై ఇంకా లోతుగా దర్యాప్తు జరగాలని ఆమె కోరుతోంది. ఈ కేసులో పోలీసుల విచారణ సక్రమంగా జరగడంలేదన్న ఆమె సిసి ఫుటేజ్ లను వెంటనే బయట పెట్టాలని ఆయన అన్నారు.