రైతాంగం మరోసారి ఉద్యమాలకు సిద్ధమవుతోంది – సీతారాం ఏచూరి

-

కలిసి పని చేయడానికి సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు కలిసి రావడం శుభపరిణామం అన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఈడీ, సిబిఐ ల ద్వారా అక్కడి ప్రభుత్వాలు లేకుండా చేయాలని చూస్తుందన్నారు.

 

5000 మందికి పైగా ఈడీ ఛార్జ్షీట్ లు ఇచ్చిందని.. కానీ 0.1 పర్సెంట్ మాత్రమే నేరం నిరూపితమైందన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకోవాలంటే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు సీతారాం ఏచూరి. కార్పొరేట్ లకి అనుకూలంగా ఉంటు మత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ అదాని కి అప్పగిస్తున్నారని ఆరోపించారు.

ఏప్రిల్ 5 న రైతంగం కూలీలు పెద్ద నిరసన తెలుపుతూ తమ రుణాలు మాఫీ చేయాలని కోరారని.. కానీ వారి కార్పొరేట్ మిత్రులకు వేల కోట్ల రుణమాఫీ చేశారని దుయ్యబట్టారు. నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయని.. రైతంగం మరోసారి ఉద్యమాలకు సిద్ధమవుతున్నారని అన్నారు సీతారాం ఏచూరి. దేశంలో మతోన్మాద ఘర్షణలను అరికట్టాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news