బిజినెస్ ఐడియా: తక్కువ పెట్టుబడి తో వ్యాపారం..లక్షల్లో లాభం..

-

బిజినెస్ ను కొత్తగా చేయాలని అనుకోనేవారికి అదిరిపోయే ఐడియా..సొంతంగా భూమి ఉన్న వారికి ఇది మంచి ఆదాయాన్ని తెచ్చే ఐడియా..అదే గులాబీల పెంపకం.మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఉన్న వాడ్జీ గ్రామ నివాసితులు గులాబీ పూలు సాగు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. వాడ్జీ దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతాల్లో ఒకటి.నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. తాగే నీటి కోసం మైళ్ల కొద్దీ దూరం వెళ్లి నీటిని తెచ్చుకునే పరిస్థితులు ఇక్కడ సర్వసాధారణం. పూర్తిగా వర్షంపైనే ఆధారపడి పంటలు పండిస్తారు ఇక్కడి రైతులు. ఈ సమస్యల ఎదుర్కొనేందుకు కొందరు రైతులు చేసిన ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుంది.

నీటి అవసరం చాలా తక్కువగా, నిర్వహణా తక్కువే కావడంతో గులాబీ సాగు వైపే మొగ్గు చూపారని కుండ్లిక్ కుమార్ వివరించాడు కుండ్లిక్ మొదట 0.25 ఎకరాల భూమిలో రసాయన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. దీని వల్ల కిలోకు రూ.4 ధర లభించింది. మతపరమైన సందర్భాలలో, ధరలు కిలో రూ.15 వరకు పెరిగాయని ఆయన ఆనాటి పరిస్థితిని గుర్తుచేసుకున్నాడు. కుండ్లిక్‌తో పాటు పూల పెంపకాన్ని స్వీకరించిన ఇతర రైతులు వ్యాపారంలో అభివృద్ధి చూడటం ప్రారంభించారు..అలా ఒక్కొక్కరూ ఆ తోట వేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.

క్రమంగా గులాబీ విస్తీర్ణం 300 ఎకరాలకు చేరింది. మార్కెటింగ్ సమస్యగా మారడంతో వారంతా కలిసి అధికారులను ఆశ్రయించారు. పూలను రోజ్ వాటర్, గుల్కంద్, ఎసెన్స్ మరియు ఇతర ఉత్పత్తులలో ప్రాసెస్ చేయాలని అధికారి సూచించినట్లు కుండ్లిక్ చెప్పారు. రైతులకు మార్కెటింగ్ నైపుణ్యంతో శిక్షణ ఇస్తామని కూడా అధికారి హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను తెలుసుకునేందుకు రైతులు ఆ ప్రాంతంలోని డిస్టిల్లర్లను సంప్రదించారు..అలా 50 వేల పెట్టుబడి తో మొదలైన ఈ వ్యాపారం లక్షల ఆదాయాన్ని ఇస్తుంది..కేవలం గులాబీ మాత్రమే కాదు అందులో కూరగాయలు కూడా పెంచడం తో ఆదాయం రెట్టింపు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version