నేడు రైతు సంఘాల కీలక భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ..

-

రైతు సంఘాల నేతలు నేడు ఢిల్లో కీలక భేటీ నిర్వహించనున్నారు. రైతుల ఆందోళనకు ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత, శనివారం (నవంబర్ 27) సంయుక్త కిసాన్ మోర్చా (SKM) భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించడానికి కీలకమైన సమావేశాన్ని నిర్వహించనుంది. మూడు వ్యవసాయ చట్టాల రద్దు, రైతు హామీలపై చర్చించే అవకాశం ఉంది. మూడు రైతు చట్టాలపై పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రైతుల సంఘాలు… కనీస మద్దతు ధరపై కూడా పట్టుబడుతున్నాయి. కనీస మద్దతు ధరపై కేంద్రం నుంచి స్ఫష్టత రావాలని కోరుతున్నారు.

కాగా ఇటీవల మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. దీని కోసం ఇటీవల కేంద్ర క్యాబినెట్ భేటీలో ‘ది ఫార్మ్ లాస్ రిపీల్ బిల్లు, 2021’కి ఆమోదం తెలిపింది. ఈనెల 29న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో.. ఈ సమావేశాల్లోనే బిల్లును తీసుకురానున్నారు.

అంతకుముందు రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ మాట్లాడుతూ… కేంద్రానికి లేఖ రాశామని, కనీస మద్దతు ధరపై కేంద్రం నుంచి స్పష్టత రాలేదని అన్నారు. రైతులతో కేంద్ర చర్చించాలని కోరారు. చివరిసారిగా జనవరి 22న చర్చించిందన్నారు. సాగు చట్టాలతో పాటు రద్దు అంశంతో పాటు, 700 మంది రైతుల మరణానికి పరిహారం మరియు షాహిద్ స్మారక్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. చనిపోయిన రైతుల గురించి.. విద్యుత్ సవరణ బిల్లు, పురుగుమందుల బిల్లు మరియు ఇతర సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక కమిటీని వేయాలి” అని టికాయత్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news