భారీ వర్షాలు : అక్కడ ఇవాళ, రేపు పాఠశాలలకు సెలవులు

-

తమిళనాడును భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో…చెన్నై సహా 23 జిల్లాలోని స్కూల్స్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది స్టాలిన్ ప్రభుత్వం. ఇవాళ, రేపు సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది.నిన్న రాత్రి నుండి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండడంతో…లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మెరీనా బీచ్ లో సందర్శికులకు అనుమతిని నిలిపివేసారు. తెన్ కాశీ,తిరునల్వేలి, చెంగల్ పట్టు తూత్తుకుడి, నాగపట్జం, సేలం, కడలూరు, కృష్ణా గిరి,వేలూరు జిల్లాలకు అతి భారీ వర్షాలు ఉంటాయాని రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండి..

నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు.. దీంతో తూత్తుకుడి ఎయిర్‌పోర్టు లో విమానాల రాకపోకలు నిలిపి వేసారు అధికారులు. అలాగే పలు విమానాలు మళ్ళించారు అధికారులూ. ఇది ఇలా ఉండగా.. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తరుణంలో ప్రజలు ఎవరూ కూడా బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేసేది వాతావరణ శాఖ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news