ధాన్యాన్ని రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దు : రైతులకు మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు

-

రైతుల నుంచి ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కల్లాల వద్దనే ధాన్యం కొనుగోలు చేస్తామని వెల్లడించారు. ట్రాన్స్ ఫోర్ట్, గోనె సంచులు, కూలీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రైతులు తొందరపడి దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దన్నారు. –కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కనుమూరు కొండాయపాలెం అడ్డాడ గ్రామాలలో యంత్రాలతో కోసి రోడ్లపై ఆరబోసిన వరి రాశులను మంత్రి నాదెండ్ల పరిశీలించారు. 

రైతులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం జరుగకుండా వెంటనే రైస్ మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల రైతులకు కీలక సూచనలు చేశారు. తక్కువ రేటుకు అమ్ముకోవద్దని తెలిపారు. ప్రభుత్వం ద్వారానే అమ్ముకోవచ్చని.. పూర్తి గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. తేమ శాతంలో కూడా సడలింపు చేశామని 24 శాతం ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్.ఎస్.కేల ద్వారా అమ్ముకోవచ్చని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news