వడ్లు అమ్మి 2 నెలలు గడిచినా బోనస్ డబ్బులు రాలేదని కౌకుంట్ల మండలం ముచ్చింతల రైతులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయేందిరను కలిశారు. వడ్లు అమ్మి రెండు నెలలు అయినా బోనస్ డబ్బులు రాలేదని ఆయనకు విన్నవించారు.
బయట మార్కెట్లో రూ.2,800 వరకు ధర ఉన్నా ప్రభుత్వాన్ని నమ్మి బోనస్ వస్తుందని వడ్లు అమ్మినట్లు రైతులు కలెక్టర్‌కు వివరించారు.బోనస్ కోసం తాము రెండు నెలలుగా ఎదురుచూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.తమ గ్రామంలోని 45 మంది రైతులకు బోనస్ డబ్బులు జమ కాలేదని తెలిపారు.దీనికి బదులిస్తూ బోనస్ పేమెంట్స్ పెండింగ్లో ఉన్న మాట వాస్తవమే అని త్వరలోనే క్లియర్ చేస్తామని కలెక్టర్ చెప్పినట్లు తెలుస్తోంది.