కాంగ్రెస్ వైఫల్యాలపై కేటీఆర్ మండిపడ్డారు. నాడు కేసీఆర్ గారి పాలనలో ఎండాకాలంలో దుంకిన మత్తడులు ఉన్నాడని… నేడు ఏడాది కాంగ్రెస్ పాలనలో ఎండుతున్న వరి మడులు దర్శనం ఇస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. నాడు ఉప్పొంగిన గంగమ్మ… నేడు అడుగంటుతున్న భూగర్భజలాలు అంటూ చురకలు అంటించారు. పదేళ్ల పాలనలో దేశంలోనే అత్యధికంగా పెరిగిన భూగర్భజలాలు….. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేగంగా పడిపోతున్న భూగర్భజలాలు అంటూ ట్వీట్ చేశారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/KTR-4.jpg)
నాలుగు నెలలలో 2 మీటర్ల లోతుకు …32 జిల్లాలలో ప్రభావం అని… రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని ఎండబెట్టి.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పడావుపెట్టిన ఫలితం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాడు ఎత్తిపోతలతో చెరువులు, కుంటలు, వాగులు వంకలు నీటితో పారిస్తే… నేడు ఎత్తిపోతలను గాలికి వదిలి .. గాలి ఆరోపణలతో కాలం వెల్లదీస్తున్నారని తెలిపారు. రైతుల శ్రమను పణంగా పెట్టి, పొలాలు ఎండబెట్టి .. కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ వికృత క్రీడ ఇదన్నారు. జాగో తెలంగాణ జాగో అంటూ నినాదించారు కేటీఆర్.
నాడు కేసీఆర్ గారి పాలనలో
ఎండాకాలంలో దుంకిన మత్తడులునేడు ఏడాది కాంగ్రెస్ పాలనలో
ఎండుతున్న వరి మడులు.నాడు ఉప్పొంగిన గంగమ్మ
నేడు అడుగంటుతున్న భూగర్భజలాలుపదేళ్ల పాలనలో దేశంలోనే అత్యధికంగా పెరిగిన భూగర్భజలాలు
నేడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో
వేగంగా పడిపోతున్న… pic.twitter.com/9HNosIAdjL— KTR (@KTRBRS) February 9, 2025