రైతుల ఆందోళన.. జల ఫిరంగులతో పోలీసులు సిద్ధం..!

-

ఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రెండు నెలలుగా హస్తిన సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న రైతులు ఈ రోజు రైతు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఈ రోజు రాస్తారోకో (చక్కా జామ్) నిర్వహించాలని రైతు సంఘాల నాయకులు శుక్రవారం పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజధాని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈనెల 26వ తేదీన నిర్వహించిన మిలియన్ మార్చ్ దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు పోలీసులు ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించారు.

ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఇప్పటికే దాదాపు 50 వేలకు మందికిపైగా పోలీసులు, పారా మిలిటరీ సిబ్బంది చేరుకున్నారు. డ్రోన్లను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షిస్తున్నారు. గాజీపూర్ సరిహద్దుల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి.. జలఫిరంగులు ఏర్పాటు చేసుకున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీసులు పటిష్ట భద్రతను చేపడుతున్నారు.

రైతు సంఘ నాయకులు దేశవ్యాప్తంగా ఈ రోజు రాస్తారోకో నిర్వహిస్తున్నామని పిలుపునివ్వడంతో పోలీసులు సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం భద్రత బలగాలను దింపింది. మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా భద్రత పెంచింది. ఆందోళనలు, అలర్లు నెలకొన్నప్పుడు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మెట్రో స్టేషన్ గేట్లను మూసివేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సింఘా, టిక్రీ సరిహద్దు ప్రాంతాల్లో రాస్తా రోకో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లపై ధర్నా నిర్వహించనున్నారు.

అయితే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను మినహాయించి దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేతలు వెల్లడించారు. రాస్తారోకో ముగిసే దశలో నిమిషం పాటు హారన్ మోగించనున్నట్లు రైతుల నేతలు తెలిపారు. అత్యవసర సేవలు, అంబులెన్స్, వైద్యం, పాఠశాలు వంటి కార్యకలాపాలను ఆటంకం కలిగించమన్నారు. రాస్తారోకో కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్‌కేఎం సీనియర్ దర్శన్ పాల్, బీకేయూ నేత రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version