పోలీసుల చేతిలో ప్ర‌త్యూష సూసైడ్ నోట్‌

-

ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ ప్ర‌త్యూష గ‌రిమెళ్ల హైద‌రాబాద్‌లో శ‌నివారం ఆత్మ‌హ‌త్యకు పాల్పడింది. అయితే ఆమెకు ఆత్మహత్యకు చెందిన సూసైడ్ నోట్ పోలీసుల‌కు దొరికింది. అందులో ఆమె త‌న ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను వివ‌రంగా వెల్లడించారు. తాను స్వేచ్ఛ‌ను కోరుకున్నాన‌ని అందులో ఆమె పేర్కొంది. అంతేకాకుండా తాను ఎవ‌రికీ భారం కాద‌ల్చుకోలేద‌ని కూడా ఆమె తెలిపారు. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అనేక సార్లు య‌త్నించిన‌ట్లు చెప్పిన ప్ర‌త్యూష‌. ప్ర‌తి రోజు తాను బాధ‌ప‌డుతూనే ఉన్న‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉంటే… శ‌నివారం రాత్రి ఉస్మానియా ఆసుప‌త్రిలో ప్ర‌త్యూష మృత‌దేహానికి పోస్టు మార్టం పూర్తి అయ్యింది. మ‌రోవైపు మ‌హిళా సెల‌బ్రిటీల‌కు డిజైనింగ్‌లో ప్ర‌త్యూష సిద్ధ‌హ‌స్తురాలని తెలుస్తోంది. దేశంలోని టాప్ 30 ఫ్యాష‌న్ డిజైన‌ర్ల‌లో ప్ర‌త్యూష కూడా ఒక‌రు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌తో పాటు ప‌లువురు క్రీడాకారుల‌కు కూడా ఆమె డిజైనింగ్ చేశారు. అయితే ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version