బాలికపై అత్యాచారం చేస్తూ.. స్నేహితుడికి లైవ్‌ స్ట్రీమింగ్‌

-

రోజూ ఎంతో మంది అత్యాచారాలకు పాల్పడుతున్న వారిపై కోర్టులు విధిస్తు్న్న శిక్షలు కామాంధుల్లో మార్పలు తీసుకురావడం లేదు. ఎన్ని కఠిన శిక్షలు విధించిన మృగాళ్లు మారడం లేదు. రోజూ.. మ‌హిళ‌లు, చిన్నారుల‌పై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. 16 ఏండ్ల బాలిక‌పై ఇద్ద‌రు వ్య‌క్తులు లైంగిక దాడికి పాల్ప‌డ‌టంతో పాటు మ‌రో స్నేహితుడికి ఘ‌ట‌న‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయ‌డం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్ సిటీలో వెలుగుచూసింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు నిందితులు ప‌రారీలో ఉన్నార‌ని కొత్వాలి పోలీస్ స్టేష‌న్ ఇన్‌చార్జ్ రాజీవ్ గుప్తా తెలిపారు.

బాలిక శుక్ర‌వారం పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో ఈ దారుణం బ‌య‌ట‌కు వ‌చ్చింది. జూన్ 2న దాదాపు 21 ఏండ్ల వ‌య‌సున్న‌ ఇద్ద‌రు వ్య‌క్తులు త‌నను హోట‌ల్‌కు తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని బాలిక ఫిర్యాదు చేసింది. నిందితులు ఘ‌ట‌న‌ను మ‌రో ఫ్రెండ్‌కు లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఫోటోలు, వీడియోలు తీసి ఆపై సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశార‌ని పోలీసులు వెల్ల‌డించారు. గ‌తంలోనూ వీరు ఇదే త‌ర‌హా నేరాల‌కు పాల్ప‌డిన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నార‌ని ప‌రారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామ‌ని తెలిపారు. నిందితుల‌పై పోక్సో, ఐటీ చ‌ట్టాల కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని వెల్ల‌డించారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version