అలర్ట్ : ఇక మీదట ఫాస్ట్ ట్యాగ్ ఉంటేనే రోడ్డెక్కండి..

-

జనవరి ఒకటి నుంచి ఫాస్ట్ ట్యాగ్ ఉంటేనే ఆ వాహనాలను టోల్ ప్లాజా లోకి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ ట్యాగ్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, జనవరి 1 నుంచి పూర్తిగా క్యాష్ చెల్లింపులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిజానికి గత ఏడాది డిసెంబర్ నుంచి అన్ని రకాల టోల్ ప్లాజాల వద్ద క్యాష్ చెల్లింపులు పూర్తిగా నిలిపి వేసి అన్నిటినీ ఫాస్ట్ ట్యాగ్ కే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ వాహనదారులు ఎక్కువగా దీన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపకపోవడంతో వెనక్కి తగ్గుతూ వస్తోంది. అయితే ఇక మీదట వెనక్కి తగ్గకూడదని భావించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అమలు చేసిన ఈ ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థను ఫాస్టాగ్ అని పిలుస్తున్నారు. ఈ ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థ ప్రకారం టోల్ ప్లాజా వద్ద నియమించబడిన కొన్ని స్కానర్ లకు మనం నేరుగా చెల్లించకుండానే సంబందిత అమౌంట్ కట్ అవుతుంది. టోల్ ప్లాజా వద్ద చెల్లింపులను సులభతరం చేయడానికి ఫాస్ట్ ట్యాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అంటే కౌంటర్ వద్ద ఆగి డబ్బులు ఇచ్చే సమయాన్ని కూడా తగ్గించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కారు లేదా వాహనం అద్దం మీదనే ఒక రేడియో ఫ్రీక్వెన్సీ కలిగిన పోస్టర్ అతికిస్తారు. టోల్ ప్లాజా వద్ద ఉన్న స్కానర్లు ఈ పోస్టర్ ను స్కాన్ చేసి వెంటనే ఎంత అయితే అమౌంట్ ఉంటుందో అంత కట్ చేసుకుంటాయి. దీంతో వాహనాలు ఎక్కువసేపు టోల్ ప్లాజా వద్ద ఆపకుండానే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీనిని ఫోన్ ను రీచార్జ్ చేసుకున్నట్టే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version