గుడ్ న్యూస్ : ఫాస్టాగ్ గడువు మరో సారి పొడిగింపు

-

వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్‌. ఫిబ్రవరి 15వ తేదీ వ‌ర‌కు ఫాస్టాగ్‌ల‌ను పొందేందుకు గ‌డువును పెంచిన‌ట్లు కేంద్రం తెలిపింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ ప్లాజాల వ‌ద్ద ఏర్ప‌డుతున్న ర‌ద్దీని త‌గ్గించేందుకు, స‌మయాన్ని ఆదా చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం జనవరి 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ విధానాన్ని క‌చ్చితంగా అమ‌లు చేసి తీరుతామ‌ని ఇది వ‌ర‌కు స్ప‌ష్టం చేసిన సనగ్తి తెలిసిందే. అయితే ఆ తేదీని కేంద్రం మరలా మార్చింది. దాన్ని ఫిబ్రవరి  15వ తేదీ వ‌రకు పొడిగించారు. జాతియ రహదారులపై టోల్ చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఫాస్టాగ్.

వేగంగా చెల్లింపులు చేయడమే కాకుండా దీని ద్వారా ఎంతో సమయం కూడా ఆదా అవుతూ వస్తుంది. ఇక కచ్చితత్వం కూడా దీని ద్వారా పెరిగుతుందని భావిస్తున్నారు.  ఇందులో భాగంగా వాహ‌నం రిజిస్ట్రేష‌న్ వివ‌రాలతో కూడిన ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్‌ను వాహ‌నం ముందు అద్దం లేదా సైడ్‌ మిర్ర‌ర్‌పై స్టిక్క‌ర్‌లా అతికిస్తారు. ఈ క్ర‌మంలో వాహ‌నం టోల్ ప్లాజా ద్వారా వెళ్లిన‌ప్పుడు అక్క‌డే పై భాగంలో ఉండే ప్ర‌త్యేక యంత్రం స‌ద‌రు బార్‌కోడ్‌ను ఆటోమేటిగ్గా రీడ్ చేస్తుంది. ఈ క్ర‌మంలో బార్ కోడ్‌కు అటాచ్ అయి ఉండే ప్రీపెయిడ్ డిజిట‌ల్ వాలెట్‌లో నుంచి టోల్ ఫీజు ఆటోమేటిగ్గా క‌ట్ అవుతుంది. దీంతో టోల్ ప్లాజాల గుండా వేగంగా వెళ్ల‌వ‌చ్చు. న‌గ‌దు కూడా చెల్లించవలసిన ప‌నిలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version