బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన కొందరు మహీంద్రా స్కార్పియోలో ఓ వివాహా వేడుకకు వెళ్తున్నారు. మార్గంమధ్యలో స్పీడ్ బ్రేకర్ రావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వెహికల్ స్కిడ్ అయ్యి కెనాల్‌లో పడిపోయింది.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక్కడే మరణించారు. బిహార్‌లోని అర్వార్ జిల్లాలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిన వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుల వివరాలు ఇంకా తెలియ రాలేదు. పోస్టుమార్టం కోసం డెడ్ బాడీలను పంపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.