ఏపీలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు గురవుతుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తాజాగా కాకినాడలో బియ్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుండటంపై పవన్ ఫోకస్ పెట్టారు. అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలోనే ఆయన శుక్రవారం ఉదయం రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో కాకినాడకు బయలుదేరి వెళ్లారు. ఎవరైతే ఈ బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్నారో వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పౌరసరఫరాల శాఖను అనుసంధానం చేసుకుని పేద ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని లబ్దిదారులకు అందేలా చూస్తామన్నారు. ఇకపై ఎవరు పీడీఎస్ బియ్యాన్ని బ్లాక్‌లో అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు.