BREAKING : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..

-

BREAKING : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏకంగా నలుగురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… చిత్తూరు జిల్లా వడమాలపేట చెక్‌పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది మరో లారీ. దీంతో… రోడ్డుకు అడ్డంగా పడిన లారీని ఢీకొట్టింది మరో కారు.

ఈ తరుణంలోనే కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఆ తర్వాత కారును ఢీకొంది మరో బైక్. దీంతో మరో ఇద్దరు మృతి చెందారు. ఇలా వరుసగా వాహనాలు ఢీ కొట్టుకోవడంతో… ఏకంగా నలుగురు మృతి చెందారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news