లంగర్ హౌస్ లోని హుడా పార్క్ చెరువులో చెరువు శుభ్రం చేసే అవుట్సోర్సింగ్ సిబ్బంది మహమ్మద్ కరీం.. ఈరోజు శివరాత్రి సందర్భంగా స్కూలుకి సెలవు ఉండడం వల్ల కరీం తన కొడుకు సాహిల్ ను తనతో పాటు తీసుకువచ్చాడు. ఈ రోజు మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో మహమ్మద్ కరీం తన కొడుకు సాయిల్ తో కలిసి వుడా పార్క్ చెరువులోని గడ్డి శుభ్రం చేసే క్రమంలో.. సాహిల్ లోతైన ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ బుడదలో ఇరుక్కుపోయాడు.
అయితే తన తండ్రిని సహాయం కోరడంతో తండ్రి కూడా వెళ్లి తన కొడుకు చేయిపట్టే క్రమంలో ఇద్దరు నీళ్లలో లోతుగా తుడుచుకుపోయిన బుడదలు ఇరుక్కుపోయి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన ఇతర ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ ఎండమాలజీ సూపర్వైజర్ కి తెలుపడంతో సూపర్వైజర్ లోకల్ ఏరియా లీడర్లకు చెప్పడంతో వారు కార్ వాల్ ఎమ్మెల్యే కౌసర్ మొహిద్దిన్ దీనికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి సమాచారం ఇవ్వడంతో అర్ధగంట వ్యవధిలో డిఆర్ఎఫ్ టీం ఘటన స్థలానికి చేరుకొని గంట సమయంలో ఇద్దరు మృతదేహాలని వెలికి తీశారు.