మెదక్ లో చిన్నారికి చిత్ర హింసలు..తండ్రిపై కేసు..!

మెదక్ జిల్లాలో మున్సిపల్ ఉద్యోగి నాగరాజు తన కూతురిని చిత్ర హింసలకు గురి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తండ్రి నాగరాజు చిన్నారిని తాడుతో కొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నట్లు వీడియో లో కనిపిస్తోంది. రెండో భార్య ముందు కూర్చుని చిన్నారి ని బాధుతుంటే ఆ మహిళ కూడా చూస్తూ ఉండిపోయింది కానీ ఆ తండ్రిని ఆపడం లేదు. ఇక చిన్నారిని తాడుతో కొట్టడమే కాకుండా చెంపపై కొడుతూ వేధిస్తున్నాడు. ఈ వీడియో వైరల్ అవ్వడం తో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇక ఈ ఘటన అధికారుల వరకు చేరడం తో చిన్నారి పాపపై మానవత్వం మరచి హింసించిన పాప తండ్రి నాగరాజు పైన Cr.No.255/2021 u/s 324 IPC, Sec 75 of JJ act లో సుమోటో కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. చిన్నారులను హింసించటం, చిన్నారులను పనిలో పెట్టి వేధించటం లాంటివి చేయటం నేరం. ఇలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులను ఎంతటివారైనా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు.https://www.facebook.com/217997488609619/posts/1206420746433950/